ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రఖ్యాత వేద పండితుడు వెంకట్రామన్‌ ఘనపాఠి మృతి

ABN, First Publish Date - 2020-07-11T08:58:09+05:30

రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత వేదపండితుడు, శంకర వేద పాఠశాల(వేద భవన్‌) వ్యవస్థాపకుడు వెంకట్రామన్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉప్పల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత వేదపండితుడు, శంకర వేద పాఠశాల(వేద భవన్‌) వ్యవస్థాపకుడు వెంకట్రామన్‌ ఘనపాఠి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. వేద విద్య పరిరక్షణ, ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు వెంకట్రామన్‌ ఘనపాఠి విశేష కృషి చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా 2019లో రాష్ట్రపతి అవార్డు ఎంపికయ్యారు. వెంకట్రామన్‌ ఘనపాఠి 1946లో తమిళనాడులో జన్మించారు.


1958 -78 సంవత్సరాల మధ్య ప్రముఖ వేద పండితులు శ్రీనివాసశాస్త్రి, రామస్వామిశర్మ, సన్నిధానం లక్ష్మీనారాయణ అవధాని, వీరేశ్వర కృష్ణ డోంగ్రే శాస్ర్తి వద్ద వేద శాస్త్రాలను అభ్యసించారు. తర్వాత కంచి కామకోటి పీఠం, శృంగేరి పీఠాల్లో వేద కార్యక్రమాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ వేద విద్యా కేంద్రం ఆచార్యులుగా సేవలందించారు. వేదాలకు సంబంధించి ప్రపంచ స్థాయి కార్యక్రమాల నిర్వహించడంతో పాటు పలు పురస్కారాలను అందుకున్నారు. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సఫిల్‌గూడలో అత్యున్నత ప్రమాణాలతో వేద పాఠశాలను స్థాపించారు.

Updated Date - 2020-07-11T08:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising