ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ రూ. 5 కోట్ల విరాళం

ABN, First Publish Date - 2020-04-11T01:39:40+05:30

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎంఆర్‌ఎఫ్‌)రూ. 5కోట్లను విరాళంగా అందజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎంఆర్‌ఎఫ్‌)రూ. 5కోట్లను విరాళంగా అందజేసింది. ఈ మేరకు జియో తెలంగాణ సీఈవో కేసీరెడ్డి, ఆర్‌ఐఎల్‌ కార్పొరేట్‌ వ్యవహారాల అధికారి కమల్‌ పొట్టపల్లి శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావును కలిసి ఐదుకోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ లేఖను అందజేశారు. కోవిడ్‌-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధాన మంత్రి పిలుపు పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతో పాటు పీఎం-కేర్స్‌ సహాయ నిధికి రిలయన్స్‌ ఇప్పటికే 530 కోట్లు అందించింది. కరోనా వైరస్‌ మహమ్మారి తీసుకు వచ్చిన సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడటానికి, గెలవడానికి దేశం సిద్ధం, ఆహారం, సరఫరాకు ఆర్‌ఐఎల్‌ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుందన్నారు. రియలన్స్‌ ఇండస్ర్టీస్‌ , రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారత దేశపు మొదటి 100 పడకల కోవిడ్‌-19 హాస్పిటల్‌తో సహా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కోవిడ్‌-19 రోగులకు చికిత్స అందించేందుకు కేవలం రెండు వారాల్లోనే ఆస్పత్రిని సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత భోజనం అందిస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా ప్రతి రోజూ దేశంలోని మిలియన్ల మందికి డోర్‌ డెలివరీ ద్వారా సామగ్రిని అందిస్తోంది. 

Updated Date - 2020-04-11T01:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising