ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాంధుడికి 20ఏళ్ల జైలు శిక్ష

ABN, First Publish Date - 2020-12-31T03:57:00+05:30

కామాంధుడికి 20ఏళ్ల జైలు శిక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ లీగల్‌, డిసెంబరు 30: ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.జయకుమార్‌ బుధవారం తీర్పు వెలువరించారు. అలాగే కిడ్నా్‌పనకు పాల్పడినందుకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సిందిగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. 5 వేల జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాలని తెలిపారు. 

కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లప ల్లి మండలంలోని ఓ గ్రామానికి  చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సదరు వ్యక్తి తన ఆరేళ్ల పెద్ద కుమార్తెను ఇంటి వద్ద తన తల్లికి అప్పగించి బతుకుదెరువు నిమిత్తం భార్య, చిన్నకుమార్తెతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి ఆ పసిపాప తన నానమ్మతో కలిసి ఉంటోంది. కాగా  2020 మార్చి ఒకటిన ఉదయం బాలిక నానమ్మ వ్యవసాయ పనులకు వెళ్లగా అదే ప్రాంతానికి చెందిన జోరిక రమేశ్‌ అనే వ్యక్తి.. బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తుండడంతో ఆమె నానమ్మ ఆరా తీయగా జోరిక రమేశ్‌ అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించింది. దీంతో ఆమె అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరిపి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. నేరం రుజువైనందున నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జయకుమార్‌ తీర్పు వెలువరించారు. కోర్టు పీసీ ఎం.సుభా్‌షగౌడ్‌ సాక్షులను ప్రవేశపెట్టగా, దర్యాప్తు అధికారిగా ఎస్‌డీపీవో ఎ.సంపత్‌రావు వ్యవహరించారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.సత్యనారాయణ కేసు వాదించారు.

Updated Date - 2020-12-31T03:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising