ఐ మిస్ యూ అని ఆమెకు చివరి మెసేజ్ పెట్టి.. ఆ యువకుడు చేసిన ఘోరమిది..!
ABN, First Publish Date - 2020-06-18T15:58:06+05:30
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దమంగళవారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన దొడ్డి అంజయ్య రెండో కుమారుడు కుమార్ (25) ఎంబీఏ వరకు చదువుకున్నాడు
మొయినాబాద్‌లో యువకుడు..
మొయినాబాద్/రంగారెడ్డి జిల్లా: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దమంగళవారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన దొడ్డి అంజయ్య రెండో కుమారుడు కుమార్ (25) ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాక కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. గ్రామంలోని రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేసి మెహదీపట్నం రైతుబజార్‌లో విక్రయించేవాడు. మంగళవారం మార్కెట్ బంద్ కావడంతో ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం రాత్రి వీరన్నపేటలోని స్నేహితుని ఇంట్లో విందుకు హాజరై ఇంటికి వెళ్లకుండా వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అనంతర గ్రామంలోని ఐదుగురు స్నేహితులకు, తన చిన్నాన కూతురు శ్వేతకు ఐ మిస్ యూ అని ఎస్‌ఎంఎస్ చేశాడు. అదేవిధంగా వాట్సప్ స్టేటస్‌లో అదే మెసేజ్ పెట్టి పొలం వద్ద ఉన్న తాడుతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్వేత బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు మెసేజ్ చూసి కుమార్ సోదరుడు శ్రీనివాస్‌కు విషయం తెలియజేసింది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు పొలం వద్దకు వెళ్లి చూడగా కుమార్ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యాచారంలో యువతి..
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలోని గడ్డమల్లాయగూడలో చోటుచేసుకంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన దండు జ్యోతి(19) కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇల్లు గడవడం భారంగా మారింది. తన కోసం అమ్మనాన్న ఎంతో బాధపడుతున్నారని జ్యోతి మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.
Updated Date - 2020-06-18T15:58:06+05:30 IST