ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేపచెట్లకు పూజలు

ABN, First Publish Date - 2020-03-25T11:52:30+05:30

వేపచెట్టుకు నీరు పోసి పూజ చేస్తే కరోనా వ్యాప్తి చెందకుండా బయట పడొచ్చని కొందరూ.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడుకులకు బరువొచ్చిందని కొందరు.. కరోనా నిర్మూలనకు అని మరికొందరు..

 వికారాబాద్‌ పట్ణణంలో ఘటన

వికారాబాద్‌ : వేపచెట్టుకు నీరు పోసి పూజ చేస్తే కరోనా వ్యాప్తి చెందకుండా బయట పడొచ్చని కొందరూ.. కొడుకులపై బరువొచ్చిందని మరి కొందరు నమ్ముతున్నారు. వేప చెట్టును పూజించి నీరు పోస్తే వారి కొడుకులకి ఏమీ కాదని మహిళలు మంగళవారం వికారాబాద్‌ పట్టణంలో పూజలు చేయడం, కొబ్బరి కాయలు కొట్టడం కన్పించింది. కొందరూ వేపచెట్టుకు పసుపుకొమ్ము సైతం కట్టి మొక్కుకున్నారు. కాగా ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నుంచి విముక్తి కలగాలని కోరుకోవడం మంచిదే అయినప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలు ఏమిటని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక మరికొందరు కొడుకులపై బరువు ఏమిటని చర్చించుకుంటున్నారు. వేపచెట్టులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఆ చెట్టును పూజిస్తే ఎలాంటి రోగాలు రావనే నానుడి. కాగా ప్రజలంతా ఒక్క దగ్గర గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతుంటే కొందరు మహిళలు ఒక్క దగ్గర చేరి చెట్లకు నీరు పోయడం కన్పించింది. ఈ ఘటన ఆ నోటా ఈ నోటా దావానంలా వ్యాపిస్తోంది. 

Updated Date - 2020-03-25T11:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising