ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజగజ.. వికారాబాద్‌ జిల్లాలో7.3 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2020-11-11T19:25:48+05:30

సాయంత్రం అయిందంటే చాలు చల్లని గాలులు. రాత్రివేళ చలి బాగా పెరిగింది. వారం రోజులుగా దీని తీవ్రత నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా పడిపోతున్నాయి. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో చలి తీవ్రత కూడా పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పది డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాతావరణంలో చోటు చేసుకుటున్న అనూహ్య మార్పులు

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల ముప్పు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/  మేడ్చల్‌): సాయంత్రం అయిందంటే చాలు చల్లని గాలులు. రాత్రివేళ చలి బాగా పెరిగింది. వారం రోజులుగా దీని తీవ్రత నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా పడిపోతున్నాయి. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో చలి తీవ్రత కూడా పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పది డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మున్ముందు పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నప్పటికీ.. రాత్రివేళల్లో మాత్రం చలి వణికిస్తోంది. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈసారి కురిసిన భారీ వర్షాలతో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే చలి ఇలా ఉంటే... ఇక డిసెంబరు, జనవరిలో ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తి పోతున్నారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో మంగళవారం 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం కాస్లాబాద్‌లో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం భాగ్యనగర్‌ నందనవనం ప్రాంతంలో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 


వణికిపోతున్న జనం..

వారం రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చల్లటి గాలులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు జనం బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వేకువ జామున వెళ్లే రైతులు కూడా కాస్త ఆలస్యంగా పొలం బాట పడుతున్నారు. ఉదయాన్నే బయటకు వెళ్లేవారు కరోనా వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు మాస్కులు, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.


మర్పల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీలుగా నమోదు..

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి గ్రామాన్ని మంచుదుప్పటి చుట్టేసింది. చలిపంజా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. రెండు రోజుల నుంచి చలి తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ నెల 9వ తేదీన 8.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా 10వ తేదీన 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్‌పేట గ్రామంలో ఈ నెల 8న 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 9న 8.4కు చేరుకుంది. 10వ తేదీన 7.7 డిగ్రీలుగా నమోదైంది. 


ఘట్‌కేసర్‌లో చలి పులి..

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని భాగ్యనగర్‌ నందనవనం ప్రాంతంలో చలితీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక్కడ ఈ నెల 9వ తేదీన 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా 10వ తేదీన 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


కాస్లాబాద్‌లో చలి తీవ్రత...

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం కాస్లాబాద్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా కాస్లాబాద్‌ను చలిదుప్పటి కమ్ముకుంది. రాత్రివేళ్లలో ఈ గ్రామ వాసులు గజగజ వణికిపోతున్నారు. ఇక్కడ ఈ నెల 9న 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా 10న 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదు కాగా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


తగిన జాగ్రత్తలు పాటించాలి: డాక్టర్‌ నళిని, పీహెచ్‌సీ వైద్యురాలు,శ్రీరంగవరం, మేడ్చల్‌ జిల్లా

చలి నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. చలికాలంలో న్యూమోనియో, డెంగ్యూ, స్వైన్‌ప్లూ, చర్మవ్యాధుల బారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉంది. శ్వాసకోశ వ్యాధులు, ఆయాసం ఎక్కువగా ఉన్నవారు చల్లటి గాలులకు తిరగకపోవడమే మంచింది. దుమ్ము, ధూళీ, పొగ మంచులో బయటకు వెళ్లకుండా ఉండాలి. చలి గాలుల వల్ల రక్తనాళాలు మూసుకుపోయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వైద్యుల సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలి.

Updated Date - 2020-11-11T19:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising