ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2020-08-15T09:36:11+05:30

పేదలకు వైద్యపరంగా అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి 


పరిగి/పూడూరు/మేడ్చల్‌: పేదలకు వైద్యపరంగా అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 57మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. రూ.29.36 లక్షల విలువ గల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకి వర్తించని చికిత్సలకు కూడా తాము భరోసా ఇస్తున్నామని తెలిపారు. చికిత్స అనంతరం అస్పత్రి బిల్లులు ఇస్తే తాము సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో రాజేందర్‌, రవీంద్ర, సురేందర్‌ పాల్గొన్నారు. మేడ్చల్‌లో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. గౌడవెల్లి గ్రామానికి చెందిన యాదగిరి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.32,500లను, సుధాకర్‌కు రూ.15వేల చెక్కును ఎంపీపీ అందజేశారు. రణదీప్‌రెడ్డి, కృష్ణయాదవ్‌,  సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.


రైతులందరికీ సకాలంలో ఎరువులు

రైతులందరికీ సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్‌లో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో  వ్యవసాయ అధికారి వీరప్ప, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ ప్రభాకర్‌ గుప్త, అనంతరెడ్డి, అజార్‌, గోవర్ధన్‌, వెంకటేశ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T09:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising