ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై నీరు తొలగింపునకు చర్యలు

ABN, First Publish Date - 2020-12-04T05:04:47+05:30

హైవేపై నీరు తొలగింపునకు చర్యలు

వర్షపు నీటిని తొలగిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు: జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలువకుండా సత్వర చర్యలు తీసుకుంటామని డీఎల్పీవో తరుణ్‌, జాతీయ రహదారుల శాఖ అధికారులు గంగాధర్‌రావు, నితిన్‌ అన్నారు. కొద్దిపాటి వర్షానికే కందుకూరులోని జాతీయ రహదారిపై నెలల తరుబడి వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. గురువారం ఎంపీపీ మంద జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. మూడు నెలలుగా రోడ్డుపై నీరు నిలువ ఉండడంతో రోడ్డుపై పాకురు పట్టిందన్నారు. కందుకూరు పంచాయతీ పరిధిలోని ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి పరిసర కాలనీల నుంచి వర్షపు నీరు వచ్చి కొత్తగూడ పంచాయతీలోని పదో వార్డు నుంచి ప్రవహించేదని, హైవేను ఏర్పాటు చేసేప్పుడు ఇక్కడ ఉన్న కల్వర్టును తొలగించడంతోనే సమస్య పెద్దదైనట్టు గుర్తించారు. వర్షపు నీరు పోవడానికి తాత్కాలికంగా ఓ పైప్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. త్వరలోనే శాశ్వంతంగా కల్వర్టును ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం రోడ్డుపై ఉన్న నీటిని తొలగించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురసాని రాజశేఖర్‌రెడ్డి, కొత్తగూడ, కందుకూరు సర్పంచ్‌లు సాధ మల్లారెడ్డి, ఎస్‌.శమంతకమణి, ఎంపీవో విజయలక్ష్మి, వార్డు సభ్యుడు టి.కార్తీక్‌, నాయకులు ప్రశాంత్‌చారి, బాల్రాజ్‌గౌడ్‌, పాండు, పంచాయతీ కార్యదర్శులు శివకుమార్‌, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising