ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను వారంరోజుల్లో పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-03T05:14:43+05:30

అభివృద్ధి పనులను వారంరోజుల్లో పూర్తి చేయాలి

చెంగోల్‌లో రైతువేదిక పనులు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌ : గ్రామ పంచాయతీల్లో చేపట్టిన రైతు వేదికలు, కంపోస్ట్‌ షెడ్‌, శ్మశాన వాటిక నిర్మాణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం తాండూరు మండలం చెంగోల్‌, అల్లాపూర్‌, జినుగుర్తి గ్రామాల్లో నిర్మాణం చేపడుతున్న అభివృద్ధి  పనులను తనిఖీ చేశారు.పనుల్లో జాప్యంపై సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు.  చెంగోల్‌ రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించి త్వరలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ మల్లీశ్వరిగౌడ్‌ను ఆదేశించారు. అనంతరం అల్లాపూర్‌ లో పనుల పురోగతిపై సర్పంచ్‌ నందినిగౌడ్‌, కార్యదర్శి భవానీనిఅడిగి తెలుసుకున్నారు. జినుగుర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏకలవ్య ఫౌండేషన్‌ను సందర్శించారు. అక్కడ సేంద్రీయ వ్యవసాయంపై అడిగి తెలుసుకున్నారు. అడిషనల్‌ కలెక్టర్‌వెంట తాండూరు ఎంపీడీవో సుదర్శఽన్‌రెడ్డి, పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌, కార్యదర్శులు మౌనిక,  సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌లు తదితరులున్నారు.


 దోమ మండల పరిధిలో...

దోమ: శ్మఽశాన వాటిక, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఎస్టీసీవో జిల్లా అధికారిణి కరుణశ్రీ, ఎంపీడీవో జయరాం అన్నారు. బుధవారం శివారెడ్డిపల్లి, దిర్సంపల్లి గొట్లచెల్క తండాల్లో శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు తదితర పనులు పరిశీలించారు.  కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 కులకచర్ల మండల పరిధిలో...

కులకచర్ల: మండల పరిధిలోని అన్ని గ్రామాల పరిధిలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి చేయాలని ఎంపీడీవో కాల్‌సింగ్‌ తెలిపారు. బుధవారం దాస్యనాయక్‌ తండాలోపల్లె ప్రకృతి వనం పనులు పరిశీలించారు. అనంతరం నర్సరీని, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డునుపరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో సుందర్‌, సర్పంచ్‌ శంకర్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ రాజు, పంచాయతీ కార్యదర్శి అనిత  తదితరులు పాల్గొన్నారు.

  మొక్కలు పెంచుదాం

 బషీరాబాద్‌: ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని  హంక్యానాయక్‌ తండా సర్పంచ్‌ దేవ్‌సింగ్‌ అన్నారు. బుధవారం గ్రామపంచాయతీలో పరిధిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలకు ఆయన నీరు పట్టారు. అనంతరం కూలీలతో కలుపుతీత పనులను చేయించారు.



Updated Date - 2020-12-03T05:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising