ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్షసాధింపు చర్యలకు దిగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-11-03T09:52:38+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ మేడ్చల్‌ జిల్లా నాయకులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ నాయకుల ఆరోపణ

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో నిరసన

ముందస్తుగా పోలీసుల అరెస్టు


మేడ్చల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ మేడ్చల్‌ జిల్లా నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఆపార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం  పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మేడ్చల్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు.


బీజేపీ నాయకుల అరెస్టు

కీసర రూరల్‌ : నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలో పోలీసులు బీజేపీ నాయకులను సోమవారం ముందస్తు అరెస్టు చేసారు. అనంతరం ఆపార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధిష్టానం పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ మేరకు నాగారం మున్సిపాలిటీ రాంపల్లికి చెందిన బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి, రోడ్డుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ కేసులు మోపి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా హక్కులను కాలరాస్తున్నారన్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీసర పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. నాగారంలో పలువురు నాయకులను కీసర పోలీసులు మందస్తుగా ఉదయం ఐదు గంటలకే అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వేణుగోపాల్‌, కొండబోయిన నాగరాజు, గొంగళ్ల ఎల్లప్ప, కొండేటి రాంరెడ్డి, ఎలసాని నాగరాజ్‌, రామారం గిరిగౌడ్‌, ఏనుగు నరేందర్‌రెడ్డి, జంగల హరిగౌడ్‌, కొండేటి లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


కీసరలో..

కీసర/శామీర్‌పేటరూరల్‌: బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఆపార్టీ నాయకులను  కీసర పోలీసులు ముందస్తు అరె స్టు చేశారు. వివిధ గ్రామాల్లోని  ముఖ్యనేతలను ఉదయం నుంచే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  ఎంసీపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ కోలుకోవాలని దుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. వెంకటేష్‌, అరుణ్‌, రాజప్ప, నరేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T09:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising