ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణం..ప్రమాదం

ABN, First Publish Date - 2020-06-04T09:13:12+05:30

మేడ్చల్‌ పట్టణంలో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ నిబంధనను ఉల్లంఘిస్తున్న ఆటోడ్రైవర్లు  ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు

రెట్టింపు చార్జీల వసూలు  కనిపించని మాస్కులు  పట్టించుకోని అధికారులు


మేడ్చల్‌ రూరల్‌ : మేడ్చల్‌ పట్టణంలో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి ఆటోలు నడుపుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చాలామంది ఆటోడ్రైవర్లు అందుకు విరుద్ధంగా నడుపుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసులు లేనందున ప్రతిఒక్కరూ ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక ఆటో యజమానులు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నారు. అదేవి ధంగా కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే ఆటోలో ఎక్కించాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నారు.


ఏకంగా 10 మందికి తగ్గకుండా ప్రయాణికులను తరలిస్తున్నారు. స్థానిక ఆటోల్లో ప్రయాణికులను తరలించే తీరు కరోనా కట్టడి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆటోల్లో ఎక్కేవారిలో సగంమంది మాస్కులు ధరించడం లేదు. ప్రధానంగా గ్రామీణప్రాంతాల వైపు వెళ్లే ఆటోలు పూర్తిగా లాక్‌డౌన్‌ నిబంధనలకు అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినపడుతున్నాయి. 

Updated Date - 2020-06-04T09:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising