ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల నిరక్ష్యం.. రైతులకు శాపం

ABN, First Publish Date - 2020-11-25T05:23:56+05:30

ద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బుడ్డి మరమ్మతులో జాప్యం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ బుడ్డిలను మంజూరు చేయకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

నీటి తడులు అందక ఎండిపోతున్న వేరుశనగ పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ట్రాన్స్‌ఫార్మర్‌ బుడ్డీల  మరమ్మతులో జాప్యం
  • ఎండిపోతున్న వేరుశనగ పంట..
  • దిక్కుతోచని స్థితిలో రైతులు

ధారూరు: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బుడ్డి మరమ్మతులో జాప్యం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ బుడ్డిలను మంజూరు చేయకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని నాగసమందర్‌ గ్రామ శివారులోని బూర్గుగడ్డ ప్రాంతంలో పదిమంది రైతులు సుమారు పది ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారు. పొలంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది.  దానిని తీసుకెళ్లిన ట్రాన్స్‌కో సిబ్బంది నెలరోజులు గడిచినా మరమ్మతులు చేసి అమర్చ లేదని రైతులు  వాపోతున్నారు. దీంతో బోర్లు నడవక సాగుచేసిన వేరుశనగ పంటకు నీటి తడులు అందక  ఎండి పోతోందని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసి అమర్చకపోతే పంటపూర్తిగా ఎండిపోనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

డీడీలు కట్టినా మంజూరు కాని  కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు

కాగా పది మంది రైతులు గత జూన్‌ నెలలో మూడు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు కోసం ట్రాన్స్‌కోకు డీడీలు చెల్లించారు. అవి చెల్లించి ఐదు నెలలు గడుస్తున్నా అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయలేదని  రైతులు వాపోతున్నారు. అధికారులు స్పం దించి ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2020-11-25T05:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising