ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు: ఏసీపీ యాదగిరిరెడ్డి

ABN, First Publish Date - 2020-02-20T05:51:58+05:30

మహేశ్వరం శ్రీశివగంగం రాజరాజేశ్వరాలయంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం : మహేశ్వరం శ్రీశివగంగం రాజరాజేశ్వరాలయంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి అన్నారు. మహేశ్వరంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు, వీఐపీల వాహనాలు నిలిపేందుకు తగిన పార్కింగ్‌ స్థలాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల పాటు నిర్వహించబడే ఉత్సవాల సందర్భంగా హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం వాహనాలను నిలిపేందుకు హనుమాన్‌ టెంపుల్‌ ఆలయం ఎదుట, అక్షిత వెంచర్‌లో వాహనాలు పార్కింగ్‌ చేయాలన్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వేలాది మంది హాజరు కానుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సీఐ వెంకన్ననాయక్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ కాకి కుమార్‌ముదిరాజ్‌, మహేశ్వరం ఉపసర్పంచ్‌ దోమ శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివా్‌సగౌడ్‌, నాయకులు కె. చంద్రయ్యముదిరాజ్‌, జోరల రమేష్‌, వీరానాయక్‌, లింగం, సత్యనారాయణ, రాజేష్‌, తదితరులున్నారు. 

Updated Date - 2020-02-20T05:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising