మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం తగదు
ABN, First Publish Date - 2020-03-27T12:00:39+05:30
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని మూడుచింతలపల్లి మండలం కేశవరం సర్పంచ్ జ్యోతిబలరామ్‌గౌడ్ అన్నారు. గురువారం కేశవరంలోని నర్సరీని ఆమె సందర్శించారు.
శామీర్‌పేట రూరల్ : మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని మూడుచింతలపల్లి మండలం కేశవరం సర్పంచ్ జ్యోతిబలరామ్‌గౌడ్ అన్నారు. గురువారం కేశవరంలోని నర్సరీని ఆమె సందర్శించారు. మొక్కలకు నీటిని సరిగ్గా పడుతున్నారా లేదా అనే విషయాలపై ఎస్‌ఎఫ్‌ఏ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హారితహరం కార్యక్రమాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. కాగా అద్రాస్‌పల్లిలోని నర్సరీలో మొక్కలకు ఎండ తగలకుండా నెట్‌షెడ్‌ను ఏర్పాటు చేశామని ఆ గ్రామ కార్యదర్శి అనురాధభవాణి ఈ సందర్భంగా తెలిపారు.
Updated Date - 2020-03-27T12:00:39+05:30 IST