ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-10-31T06:20:42+05:30

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి జీవనానికి ఇబ్బంది పడుతున్న కళాకారులకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకోవాలని కళాకారుల సంఘం జిల్లా నాయకుడు, ప్రముఖ చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంఘం జిల్లా నాయకుడు రూపం వెంకట్‌రెడ్డి


ఆమనగల్లు : కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి జీవనానికి ఇబ్బంది పడుతున్న కళాకారులకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకోవాలని కళాకారుల సంఘం జిల్లా నాయకుడు, ప్రముఖ చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి కోరారు. గత ఎనిమిది నెలల కాలంగా ఉపాధి లేక జిల్లా వ్యాప్తంగా వేల మంది కళాకారులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమనగల్లులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజలను చైతన్యం చేయడంలో కళాకారులు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. 


కొవిడ్‌-19 నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామాల్లో కరోనా వల్ల కలిగే అనర్థాలను, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ల ధరింపు అవశ్యకత, పోలీసుల, వైద్యుల, పారిశుధ్య కార్మికుల సేవలను వివరిస్తూ అనేక చోట్ల చిత్రాల ద్వారా ప్రజలను చైతన్యం చేసినట్లు చెప్పారు. 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు రూ.5 వేలు పింఛన్‌, ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాల్లో కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో కళాకారులు కొండల్‌, లింగం, గోపి, గిరి, శ్రీనివాస్‌, మల్లేశ్‌, రాము, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T06:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising