ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతయిన బాలుడి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-10-04T05:42:35+05:30

నగరం నుంచి శామీర్‌పేట చెరువు వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమైన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట రూరల్‌: నగరం నుంచి శామీర్‌పేట చెరువు వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమైన విషయం పాఠకులకు తెలిసిందే. మరో విద్యార్థి మృతదేహం కోసం పోలీసులు, ఎన్‌డీఆర్‌ఏ, డీఆర్‌ఏ బృందాలు శనివారం తెల్లవారు జామున నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీశారు. వివరాల్లోకి వెళ్తే.. శామీర్‌పేట మండల కేంద్రంలోని పెద్దచెరువు వద్దకు నగరంలోని సఫిల్‌గూడ పాత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న స్నేహితులు ఆరుగురు శుక్రవారం చెరువు వద్దకు వచ్చారు. వీరిలో సిజ్జు ఆలియాస్‌ మనీష్‌(16), పింటూ ఆలియాస్‌ ఉత్తేజ్‌(16) ఇద్దరు చెరువులో దిగి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. వీరిలో మనీష్‌ మృతదేహం లభ్యం కాగా ఉత్తేజ్‌ గల్లంతయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఏ, డీఆర్‌ఏ, జాలరులు, పోలీసులు, ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది శనివారం ఉదయం 6గంటల నుంచి 11.30 గంటల వరకు సుమారు ఆరు గంటలు శ్రమించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.


ఉత్తేజ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సందర్భంగా పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ శామీర్‌పేట పెద్ద చెరువుకు వచ్చిన సందర్శకులు ఎవరూ చెరువులోకి దిగవద్దని సూచించారు. సందర్శకులు దూరం నుంచి చెరువు అందాలను వీక్షించాలని ఇక నుంచి చెరువు వద్ద పోలీస్‌ పెట్రోలింగ్‌ను చేపడుతామని అన్నారు. సుమారుగా 18మంది సిబ్బందితో ఆరుగంటలు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసిన డీఎన్‌ఆర్‌ఏ, డీఆర్‌ఏ, ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది, జాలరులు, పోలీసులను అభినందించారు. అనంతరం ఉత్తేజ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్‌ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ యోగే్‌షకుమార్‌, ఏఎ్‌సఐ వెంకట్‌రెడ్డి, ఎమర్జెన్సీ ఆఫీసర్‌ సర్ధార్‌, డీఆర్‌ఏ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌, సీఐ సంతోషం, ఎస్‌ఐలు రవికుమార్‌, గణేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-10-04T05:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising