ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-05-29T09:52:30+05:30

తాండూరు మండ లం బెల్కటూర్‌ గ్రామంలో రైతులు ధాన్యం విక్రయాలను నిలిపివేసి ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హమాలీ ఖర్చుల భారం 

మోపుతున్నారంటూ ఆగ్రహం


తాండూరు రూరల్‌ : తాండూరు మండ లం బెల్కటూర్‌ గ్రామంలో రైతులు ధాన్యం విక్రయాలను నిలిపివేసి ఆందోళనకు దిగారు. క్వింటాలుకు రూ.25లు హమాలీ తీసుకునేవారని, ప్రస్తుతం బస్తాకు రూ.30నుంచి రూ.35ల వరకు హమాలీ ఖర్చు అడుగుతున్నారని రైతులు అధికారులను నిలదీశారు. బెల్కటూర్‌ నుంచి సిద్దిపేట్‌కు వెళ్లిన ధాన్యం లారీలో ఏడు క్వింటాళ్లు తరుగు రావడంపై రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏడు క్వింటాళ్లకు సరిపడా డబ్బులను తమ వద్ద నుంచి కోత విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బస్తాకు రెండు కిలోల తరుగు తీయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-29T09:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising