ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్సు దాడులు

ABN, First Publish Date - 2020-12-01T05:19:47+05:30

ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్సు దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌: ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం ఆర్ధరాత్రి దాడులు జరిపి, వేర్వేరు చోట్ల అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్కడికక్కడే ఆరుగురిని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. బషీరాబాద్‌ మండల పరిధిలో నది పరివాహక ప్రాంతలైన దామర్‌చెడ్‌, ఎక్మాయి, ఇందర్‌చెడ్‌ తదితర ప్రాంతల్లో రాత్రుల్లో  కొంత కాలంగా ఆక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటగిరి, బషీరాబాద్‌ ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి  ఆధ్వర్యంలో సిబ్బంది దామర్‌చెడ్‌, ఇందర్‌చెడ్‌, నీళ్లపల్లి గ్రామాల పరిసరాల్లో ఆర్ధరాత్రి తర్వాత ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.  కర్ణాటకకు చెందిన ముకుంద డ్రైవర్‌, అమ్ర్యానాయక్‌, దామర్‌చెడ్‌కు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఎర్ర సురేష్‌,  ఎండీ. షాబోద్దీన్‌, ఇందర్‌చెడ్‌కు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంజిలప్ప, బసప్పలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.   

Updated Date - 2020-12-01T05:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising