ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పు చేయను...ధైర్యంగా ఉంటా

ABN, First Publish Date - 2020-12-03T05:04:33+05:30

తప్పు చేయను...ధైర్యంగా ఉంటా

ఎస్పీ నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •      తనపైౖ ఆరోపణలు నిరాధారమైనవి : ఎస్పీ నారాయణ

తాండూరు : తానెప్పుడూ తప్పు చేయలేదని, అందుకే ధైర్యంగా ఉంటానని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ స్పష్టం చేశారు. బుధవారం తాండూరు పోలీసు స్టేషన్‌ తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విధి నిర్వహణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తానని, అందుకే కొందరికి ఇది నచ్చదని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం, కోపం లేదన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడికి రోజూ వారీగా వచ్చివెళుతూ విధులు నిర్వహిస్తారని ఇది నచ్చదని అన్నారు. ఎవరి డ్యూటీ వారు సక్రమంగా నిర్వహిస్తే సమస్య ఉండదని అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, ఉన్నతాధికారులు కూడా ఈ విషయమై తనను వివరణ కోరలేదని, బదిలీ జరుగుతుందన్న విషయం అవాస్తవమన్నారు. ఇప్పట్లో ఎస్‌ల బదిలీలు లేవని అన్నారు. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు, రేషన్‌ బియ్యం తదితర వాటిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని ఎస్పీ ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాండూరు ప్రాంతంలో కాగ్నానది ఉన్న కారణంగా ఇసుక అక్రమ రవాణా కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. గుట్కా, ఇసుక తదితర అక్రమ రవాణాలను అరికట్టేందుకు మైన్స్‌, రెవెన్యూ శాఖలు పోలీసులతో కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీసు స్టేషన్‌లో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలపై క్షుణ్ణంగా రివ్యూ చేస్తున్నామని అన్నారు. 


Updated Date - 2020-12-03T05:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising