చరిత్రలో తొలిసారి..
ABN, First Publish Date - 2020-03-27T11:49:17+05:30
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రైల్వేలో ఇన్ని రోజులు రైళ్ల రద్దుతోపాటు స్టేషన్‌లను మూసివేసిన ఘటనలు జరగలేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మహాత్మాగాంధీ, క్వీన్
తాండూరు రైల్వేస్టేషన్ మూత
తాండూరు : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రైల్వేలో ఇన్ని రోజులు రైళ్ల రద్దుతోపాటు స్టేషన్‌లను మూసివేసిన ఘటనలు జరగలేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మహాత్మాగాంధీ, క్వీన్ విక్టోరియా దివంగతులైన రోజున ఒక్కోరోజు మాత్రమే బంద్‌ను ప్రకటించారని పలువురు చర్చించుకున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి దాదాపు 10 రోజులపాటు రైల్వే సేవలు పూర్తిగా నిలిపివేయడానికి పచ్చజెండా ఊపింది. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి తాండూరులో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాత్రికి రాత్రే స్టేషన్‌లో దుకాణదారులు తమ సామగ్రి భద్రపరుచుకున్నారు.
స్టేషన్ పారిశుధ్య కార్మికులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, స్టేషన్ మాస్టర్ తదితర అత్యవసర వ్యవస్థలు మినహా అన్ని విభాగాల్ని దాదాపు మూసి వేయడంతో ప్లాట్ ఫామ్‌లన్నీ నిర్మానుష్యంగా మారాయి. స్టేషన్‌లోకి అనధికార వ్యక్తులు రాకుండా అన్ని ప్రవేశ ద్వారాల్ని మూసేశారు. ఒక్క ప్రధాన ద్వారం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మినహా ఇతరుల్ని లోపలికి వెళ్లనీయడం లేదు.
Updated Date - 2020-03-27T11:49:17+05:30 IST