ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-10-17T06:26:24+05:30

చిరువ్యాపారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని గుండ్లపోచంపల్లి మున్సిపల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: చిరువ్యాపారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి సూచించారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలో 200మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారంతో రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కరోనాతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి చేయూతనిందిచేందుకు ఈరుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు.


రుణాలను సకాలంలో చెల్లిస్తే 7శాతం రాయితీతో పాటు భవిష్యత్తులో మరిన్ని రుణాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలో 21వేల మందికి రుణాలు అందిచనున్నట్లు లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కిషోర్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ బ్యాంకు ఏ.జి.యం కిషోర్‌, మేనేజర్‌ సాయికుమార్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మైసమ్మగూడలో అంగన్‌వాడీ కేంద్రాన్ని చైర్‌పర్సన్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి పౌష్ఠికాహారాన్ని పంపిణీ చేశారు. 

Updated Date - 2020-10-17T06:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising