ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-14T04:48:48+05:30

ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

షాద్‌నగర్‌ చౌరస్తాలో జర్నలిస్టుల మానవహారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు

షాబాద్‌: జర్నలిస్టుపై బెదిరింపులకు పాల్పడిన పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహిపాల్‌రెడ్డి తీరును ఖండిస్తూ నిరసన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను వెలికితీస్తున్న జర్నలిస్టును ఎమ్మెల్యే బెదిరిస్తూ దూషించడం సరికాదన్నారు. తెలంగాణ సాధనలో పత్రికలు, మీడియా క్రియాశీల పాత్ర పోషి ంచాయని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. అలాంటిది ఆయన తన పార్టీ ఎమ్మెల్యే జర్నలిస్టును బెదిరించినా స్పందించకపోవడం శోచనీయం అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కుల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కర్రె శ్రీశైలం, ప్రజాచైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాపోల్‌ నర్సింహులు, బీసీ సంఘం మండల కార్యదర్శి మున్నూరు శ్రీనివాస్‌, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


షాద్‌నగర్‌లో జర్నలిస్టుల మానవహారం

షాద్‌నగర్‌: భూ కబ్జాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులకు నిరసనగా పట్టణ జర్నలి స్టులు, ప్రజా సంఘాలతో కలిసి ఆదివారం సాయంత్రం ర్యాలీ చేపట్టి చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. జర్నలిస్టులు, నాయకులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో పాటు వెలుగులోకి తెస్తే జీర్ణించుకోలేని ప్రజాప్రతినిధులు బె దిరింపులకు పాల్పడడం శోచనీయమన్నారు. భూ కబ్జాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్‌ చేయిస్తున్నారని, వారిపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు సత్యనారాయణ, శ్రీశైలం, నర్సింహారెడ్డి, రాజశేఖర్‌, సమీ, ఇలియాస్‌, విష్ణు, శివ, శ్రవణ్‌, ఖాజా, శ్రీహరిరాజు, ప్రజాసంఘాల నాయకులు అర్జునప్ప, తిరుమలయ్య, జనార్ధన్‌, టీ జీ.శ్రీనివాస్‌, ఈశ్వర్‌, శివారెడ్డి, రవీంద్రనాథ్‌, సత్యం, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.


నేడు చేవెళ్లలో జర్నలిస్టుల ధర్నా

చేవెళ్ల: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జర్నలిస్టును బెదిరించడాన్ని ఖండిస్తూ సోమవారం చేవెళ్లలో మహాధర్నా నిర్వహిస్తున్నట్టు చేవెళ్ల ప్రెస్‌క్లబ్‌ కమిటీ తెలిపింది. ఆదివారం వారు మాట్లాడుతూ.. ఉదయం 11గంటలకు ధర్నా ఉంటుందని, ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హాజరుకావాలని కోరారు.


Updated Date - 2020-12-14T04:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising