ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమం తప్పకుండా జీవాలకు టీకాలు వేయించాలి

ABN, First Publish Date - 2020-12-03T04:46:54+05:30

క్రమం తప్పకుండా జీవాలకు టీకాలు వేయించాలి

గొర్రెకు టీకా వేస్తున్న డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర: మూగజీవాలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ టీకాలు వేయించాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు కీసర మండలం యాద్గార్‌పల్లి గ్రామంలో బుధవారం నట్టల నివారణ టీకాల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారణ టీకాలు వేయడం ద్వారా రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుందన్నారు. పునరుత్పత్తి పెరుగుతుందన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తారని, గొర్రెల, మేకల పెంపకందారులు తప్పనిసరిగా పశుగ్రాసాన్ని సాగు చేయాలని  అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బెస్త వెంకటేష్‌, వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ జూపల్లి వెంకటేష్‌, డాక్టర్లు శ్యామల, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising