ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఆర్‌ఐఎంఎస్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2020-03-16T06:25:55+05:30

అనంతగిరిలోని కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని పటాన్‌చెరులో ఉన్న తన ఆసుపత్రికి మార్చాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వికారాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అనంతగిరిలోని కరోనా ఐసోలేషన్‌ కేంద్రాన్ని పటాన్‌చెరులో ఉన్న తన ఆసుపత్రికి మార్చాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి చేవెళ్ల మాజీఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తో కలిసి ఆయన మంత్రిని కలిశారు.


ఈ సందర్భంగా అనంతగిరిలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులు, భక్తులు తగ్గిపోతున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఐనోల్‌ వద్ద ఉన్న టీఆర్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 350 పడకలున్నాయన్నారు. అత్యవసర, సాధారణ పరిస్థితుల్లో వైద్యం చేయడానికి వీలుగా అన్ని సదుపాయాలు ఉన్నాయని వివరించారు. అనంతగిరి అభివృద్ధిని కాంక్షించి తమ ప్రతిపాదనకు అంగీకరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.   

Updated Date - 2020-03-16T06:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising