ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి

ABN, First Publish Date - 2020-11-22T04:54:27+05:30

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి

వికారాబాద్‌ : సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరియాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయి స్కాలర్‌షి్‌పలు అందిస్తూ హిందూ బీసీ విద్యార్థులకు ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లాల్‌కృష్ణప్రసాద్‌, వెంకటేష్‌, లక్ష్మీనారాయణ, సాయిలు, ఆంజనేయులు, నర్సింలు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

ఆరేళ్లుగా పోరాడుతున్నాం..

మోమిన్‌పేట : బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం వికారాబాద్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పులి సంగప్పగౌడ్‌ కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపు మేరకు శనివారం మండల పరిధిలోని అమ్రాదికలాన్‌ గ్రామంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలని గత ఆరేళ్లుగా పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఎంబీఏ తదితర కోర్సుల్లో చదివే బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజును ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్‌, ఎండీ.జావిద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T04:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising