ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహ్లాదం.. ఆమడదూరం

ABN, First Publish Date - 2020-11-17T08:43:37+05:30

కల్వకుర్తి నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా, రాష్ట్ర రాజధానికి చేరువలో ఉండి దినదినాభివృద్ధి చెందుతున్న ఆమనగల్లు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఒక్క పార్కు కూడా లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆమనగల్లులో ఆనందానికి, ఆటవిడుపునకు అడ్రస్‌ కరువు

 మున్సిపాలిటీగా మారినా పార్కులకు నోచని పట్టణం


ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా, రాష్ట్ర రాజధానికి చేరువలో ఉండి దినదినాభివృద్ధి చెందుతున్న ఆమనగల్లు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఒక్క పార్కు కూడా లేదు. మున్సిపాలిటీ పాలన అమలవుతున్నా.. ఏటా లక్షలాది రుపాయల ఆదాయం వస్తున్నా.. పార్కుల నిర్మాణంపై ఎవరూ దృష్టి సారించడం లేదు. సుమారు 15వేల జనాభా కలిగిన ఆమనగల్లు పట్టణంలో ఒక్క పార్కు కూడా లేకపోవడంతో పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో విశ్రాంతికి, ఆటవిడుపుకు నోచుకోలేకపోతున్నారు. ఆనేక పట్టణాల్లో పార్కులను అభివృద్ధి చేస్తుంటే ఆమనగల్లులో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పట్టణంలోని కొన్ని కాలనీలలో గతంలో కమ్యూనిటీ అవసరాలకు, పార్కుల కోసం తీసిన స్థలాలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి దాపురించింది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం, మార్కెట్‌ యార్డు, అటవీశాఖ కార్యాలయ ఆవరణాల్లో స్థలాలు విశాలంగా ఉన్నప్పటికీ కనీసం పార్కుల నిర్మాణంపై ఎవరూ దృష్టి సారించడం లేదు. గతంలో పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఫైవ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల పార్కు నిర్వహణ లేక నేడు కళాహీనంగా మారింది. పార్కులోని ఆటవస్తువులు తుప్పుపట్టి అపహరణకు గురయ్యాయి.


అదేవిధంగా పాత మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ తల్లి పార్కు, పట్టణంలో శివాజీ పార్కు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పట్టణంలో ఒక్క పార్కు కూడా లేకపోవడం పాలకుల తీరుకు నిదర్శనంగా నిలిచిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు కూడా పార్కులకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా చోట్ల పార్కులను ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పార్కుల నిర్మాణం దిశగా చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-11-17T08:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising