ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.40 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ABN, First Publish Date - 2020-02-22T11:12:10+05:30

రూ.40 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట : రాజకీయాలకతీతంగా మున్సిపల్‌లోని వార్డుల్లో అభివృద్ధి పనులను చేపడుతామని చైర్మన్‌ రాజేశ్వరావు అన్నారు. గురువారం శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ కారంగుల రాజేశ్వర్‌రావు అధ్యక్షతన కమిషనర్‌ గోవర్ధన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పన్నాల వాణి, కౌన్సిలర్లతో తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి 17 వార్డుల కౌన్సిలర్లు విచ్చేశారు. తమ వార్డులో అభివృద్ధి పనులను ప్రాధాన్యపరంగా చేపట్టి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని చర్చించారు. మున్సిపల్‌ పరిధిలోని వివిధ కాలనీల్లో హెచ్‌ఎండబ్లుఎ్‌సఎ్‌సబీ ద్వారా నిర్మిస్తున్న పనులు, విద్యుత్‌ స్తంభాలు, ఆరోగ్య, అంగన్‌వాడీ నిర్వహణ, రవాణా సౌకర్యం, వ్యవసాయం విభాగాల పనులపై చైర్మన్‌, కౌన్సిలర్లు చర్చించారు. మొదటిసారిగా మున్సిపల్‌లోని దేవర్‌యాంజాల్‌ పరిధిలో వైకుంఠదామం అభివృద్ధికి రూ. 15 లక్షల నిధులను, హకీంపేట, సింగాయిపల్లి గ్రామాల్లో వైకుంఠదామం అభివృద్దికి రూ. 25 లక్షల నిధులను కేటాయిస్తున్నట్లు చైర్మన్‌, కౌన్సిలర్లతో ఆమోదిస్తు తీర్మానించారు. తాగు నీరు ఏర్పాటు, డ్రైనేజీ మరమ్మత్తులకు, పారిశుద్ద్య నిర్వహణకై మున్సిపల్‌ సాధారణ, 14వ ఫైనాన్స్‌ నిధుల నుంచి చేపట్టాలని అమోదం తెలిపారు.

Updated Date - 2020-02-22T11:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising