ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-11-25T05:36:59+05:30

అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ సీఐ వెంకటగిరి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ సీఐ వెంకటగిరి తెలిపారు. మాదారం శివారులో డీసీఎంలో రేషన్‌ తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్‌ ఇర్ఫాన్‌ఖాన్‌తోపాటు, బియ్యం వ్యాపారి ప్రవీన్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డీసీఎం, బియ్యాన్ని పరిగి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.


 అక్రమ రవాణాపై విచారణ

దోమ: మండల పరిధిలోని గంజిపల్లి గ్రామంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణ పై మంగళవారం ఆర్‌ఐ లింగం విచారణ చేపట్టారు. గ్రామం నుంచి వాహనంలో సోమవారం రాత్రి రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్నారని గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా కర్ణాటక రాష్ట్రం నుంచి జొన్నలు తీసుకొచ్చి ఇక్కడి రేషన్‌ కార్డుదారుల నుంచి బియ్యం తీసుకెళ్లేవారని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. గ్రామం నుంచి ఎవరైనా అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తే అధికారులకు సమాచారం అందించాలని ఆర్‌ఐ తెలిపారు.  వాహనంలో తరలించినవి రేషన్‌  బియ్యమా? జొన్నలా..? అనేది స్పష్టత లేదని ఆర్‌ఐ అన్నారు.

Updated Date - 2020-11-25T05:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising