ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవార్డు మరింత బాధ్యత పెంచింది

ABN, First Publish Date - 2020-03-08T08:14:44+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేశ్వరం మండల పరిషత్‌ వైస్‌ఎంపీపీ రాత్లావత్‌ సునీతా అంద్యానాయక్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్వరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేశ్వరం మండల పరిషత్‌ వైస్‌ఎంపీపీ రాత్లావత్‌ సునీతా అంద్యానాయక్‌కు మహిళా శిరోమణి ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2020 అవార్డు దక్కింది. శనివారం తెలంగాణ సిటిజన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ముందస్తుగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళా భవన్‌లో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మండల వైస్‌ ఎంపీపీ మాట్లాడుతూ సామాన్య గిరిజన తండాకు చెందిన తమను ప్రజలు ఆదరించి మండల వైస్‌ ఎంపీపీ చేశారని ఇటు ప్రజలు, అటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో  ఆనందంగా ఉందన్నారు. అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడ్రు పుష్పలీల చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిది రాజ్‌నారాయణతో, నాయకులు ఆంద్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T08:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising