ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామమందిర భూమిపూజ చారిత్రక ఘట్టం

ABN, First Publish Date - 2020-08-04T10:01:17+05:30

అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ చారిత్రక ఘట్టమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌ రూరల్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ చారిత్రక ఘట్టమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని హిమయత్‌నగర్‌లోని కంజర్ల ప్లాజాలో విలేకరులతో మాట్లాడారు. రామ మందిరం నిర్మాణానికి ఉద్యమించిన కరసేవకులను ఆగస్టు 5న ఘనంగా సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. 1989, 1992లో యూపీలో రామ మందిరం కోసం ఉద్యమించిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల్లోని గ్రామాలకు చెందిన కరసేవకులను సన్మానిస్తామని తెలిపారు. కంజర్ల ప్లాజాలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మధుసూధన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, జంగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-04T10:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising