ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతువేదికకు తుదిమెరుగులు

ABN, First Publish Date - 2020-12-08T05:06:02+05:30

రైతువేదికకు తుదిమెరుగులు

మూడుచింతలపల్లిలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భవనాన్ని పరిశీలించిన ఎంఏవో 
  • త్వరలో ప్రారంభోత్సవానికి చర్యలు


శామీర్‌పేట: మూడుచింతలపల్లిలో నిర్మిస్తున్న రైతువేదిక భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ భవన నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి రూ.20లక్షలు మంజూరు చేసి రైతులకు అండగా నిలిచారు. భవన నిర్మాణానికి స్థానిక దుర్గమ్మ ఆలయ సమీపంలో గత జూలైలో మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ వేదిక భవనాన్ని అందమైన రంగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ భవనం ప్రస్తుతం 95శాతం నిర్మాణ పనులు పూర్తయి తుది మెరుగులను దిద్దుకుంటోంది. సోమవారం మండల వ్యవసాయాధికారి క్రిష్ణవేణి, ఏఈవో జ్యోతిలు నర్మాణ పనులను పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు లేకుండా కాంట్రాక్టరు నాణ్యతగానే నిర్మించినట్లు ఎంఎవో పరిశీలనలో వెల్లడించారు. మరో పదిరోజుల్లో ఈ భవనాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఏవో వివరించారు. 

Updated Date - 2020-12-08T05:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising