ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడిటింగ్‌కు వేళాయె..

ABN, First Publish Date - 2020-05-19T09:34:10+05:30

ఆర్థిక సంవత్సరం ముగిసినందున ఆడిట్‌కు సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రికార్డులు సిద్ధంగా ఉంచాలని పీఆర్‌ కమిషనర్‌ ఆదేశం


తాండూరు : ఆర్థిక సంవత్సరం ముగిసినందున ఆడిట్‌కు సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి నూతన(2020-21) ఆర్థిక సంవత్సరం ఆరంభమైంది. 31 మార్చి నాటికి గతేడాది ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, డివిజన్‌లో పంచాయతీలు, జిల్లాపరిషత్‌, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో ఆడిటింగ్‌ చేయించేందుకు రికార్డులన్నింటినీ సిద్ధంగా పెట్టుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా వికారాబాద్‌ జిల్లాలో 565 గ్రామపంచాయతీలు, 18 మండల పరిషత్‌లు ఉన్నాయి.


2 డీఎల్‌పీవో కార్యాలయాలున్నాయి. గ్రామపంచాయతీలు, జిల్లా పరిషత్‌ పంచాయతీ అధికారి పరిధిలో, మండల పరిషత్‌  కార్యాలయాలు జిల్లా పరిషత్‌ అధికారి పరిధిలో పనిచేస్తాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్‌కు జిల్లా పంచాయతీ అధికారికి, మండల పరిషత్‌ ఆడిటింగ్‌ బాధ్యతలను సీఈవోకు అప్పగించారు. కార్యాలయాల వారీగా రశీదులు, చార్జీల స్టేట్‌మెంట్‌లను సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-05-19T09:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising