ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిగి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి

ABN, First Publish Date - 2020-11-22T04:49:50+05:30

పరిగి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి

పరిగిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హామీ

పరిగి: పరిగి నియోజకవర్గ శాశ్వత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. పరిగి పట్టణ పరిధిలోని ఐదో వార్డులో శనివారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతుకుముందు మండల పరిధిలోని బర్కత్‌పల్లిలో  సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ, పరిగి పట్టణ పరిధిలోని రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవికాకుండా మరో రూ.3 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఎంపీపీ అరవింద్‌, వైఎ్‌సచైర్మన్‌ ప్రసన్నలక్ష్మి, నాయకులు ఆంజనేయులు, టి.వెంకటేశ్‌, వార్ల వరి, ఎదిరె కృష్ణ; ఎర్ర శేఖర్‌, ప్రవీణ్‌రెడ్డి, సురేందర్‌, కావలి లక్ష్మి, ఇ.కృష్ణ పాల్గొన్నారు. అదే విధంగా కులకచర్ల మండలం మందిపాల్‌ గ్రామానికి చెందిన గోరెంక మల్లేశ్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన చెక్కును  అందజేశారు. రాజశేఖర్‌, జోళ్లు సాయిముదిరాజ్‌ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు

కులకచర్ల: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వంలోనే గుర్తింపు లభించిందని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్లలో రూ.22 లక్షలతో అటవీ శాఖ బీట్‌ అధికారి నివాస సముదాయం నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పుట్టపహాడ్‌లో డీసీఎమ్మెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, పరిగి రేంజ్‌ ఆఫీసర్‌ అబ్దుల్‌ హాయ్‌, పీరంపల్లి రాజు, రాజశేఖర్‌గౌడ్‌, నర్సింహులు, రాంలాల్‌నాయక్‌, శేరి రాంరెడ్డి, కృష్ణయ్యగౌడ్‌, ముంబాయి రాములు, వెంకటయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T04:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising