ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రకృతికి కేటాయించిన స్థలంలో నిర్మాణాల తొలగింపు

ABN, First Publish Date - 2020-12-03T05:08:50+05:30

పల్లె ప్రకృతికి కేటాయించిన స్థలంలో నిర్మాణాల తొలగింపు

ఇంటి నిర్మాణాన్ని తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు: రాజాపూర్‌ గ్రామంలో పల్లె ప్రకృతి ఏర్పాటు కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామ శివారులోని సర్వే నంబరు 101లోని ప్రభుత్వ భూమిలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు 20 గుంటల స్థలం కేటాయించారు. కాగా ఈ భూమిలో అదే గ్రామానికి చెందిన అలీసాబ్‌, పక్రుద్దీన్‌, హన్మయ్య, బంటు కిష్టయ్య, కుర్వ నర్సింహులు. పి.నర్సింహులు, అనంతమ్మలు కబ్జాలో ఉండి  ఇళ్లు, పశువుల పాకల నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలంలో పల్లె ప్రకృతివనానికి కేటయించటంతో పంచాయతీ అధికారులు వారికి నోటీసులిచ్చారు. మంగళవారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తుతో ఈ స్థలంలో ఉన్న  నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తోతొలగించి స్థలాన్ని పంచాయతీకి అప్పగించారు. కాగా తమకు ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చినందున ఇళ్లు, పశువుల పాకలు నిర్మించుకున్నామని తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించిపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. 


Updated Date - 2020-12-03T05:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising