అనాథలను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2020-03-27T12:02:29+05:30
ఆపదలో ఉన్న అనాధలను ఆదుకోవడానికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముందుకు రావాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్ పిలుపునిచ్చారు. గురువారం
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్
షాద్‌నగర్: ఆపదలో ఉన్న అనాధలను ఆదుకోవడానికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముందుకు రావాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు వీహెచ్‌పీ మద్దతునిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హనుమాన్ జయంతి, శ్రీరామనవమి మహోత్సవాలను రద్దు చేశామని ఆయన తెలిపారు. ప్రతి దేవాలయ కమిటీ తమతమ ప్రాంతాల్లో ఉన్న పేదలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు కరోనాపై ప్రజలకు ఆవగాహన కల్పించాలని ఆయన కోరారు.
Updated Date - 2020-03-27T12:02:29+05:30 IST