ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రెడిట్‌ గ్యారంటీ కింద నూరుశాతం రుణాలు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-08-07T06:14:40+05:30

కేంద్ర ప్రభుత్వం క్రెడిట్‌ గ్యారంటీ పథకం కింద నూరుశాతం రుణాలను అందిచేందుకు చర్యలు తీసుకుంటుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కేంద్ర ప్రభుత్వం క్రెడిట్‌ గ్యారంటీ పథకం కింద నూరుశాతం రుణాలను అందిచేందుకు చర్యలు తీసుకుంటుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌ అభియాన్‌, కొవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎస్‌ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. మధ్య, చిన్నతరహా పారిశ్రామికవేత్తలకు రుణాలు నూరుశాతం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.


కొవిడ్‌-19ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్‌ వివరించారు. జిల్లాలోని 20 పరీక్ష కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 17,607 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లా, ఏరియా ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో దాతల సాయంతో రానున్న మూడు అంబులెన్సులను కొవిడ్‌ నియంత్రణకు ఉపయోగిస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు హరీష్‌, ప్రతీక్‌జైన్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T06:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising