ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలు

ABN, First Publish Date - 2020-11-25T04:21:28+05:30

నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలు

చేవెళ్లలో నిర్మాణ దశలో ఆగిన భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీగా పెరుగుతున్న సిమెంట్‌, స్టీలు ధరలు

నిర్మాణ వ్యయం పెరుగుదలతో ఆందోళనలో ప్రజలు

ముందుకు సాగని కట్టడాలు

చేవెళ్ల: పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్న ఆశ కలగానే మిగిలిపోతోంది. నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండంటంతో ఇల్లు నిర్మించుకోవాల ంటేనే అడుగు ముందుకువేయని పరిస్థితి నెలకొంది. ప్రస్తు తం మార్కెట్‌లో సిమెంట్‌  ధరలకు రెక్కలు వచ్చాయి. స్టీల్‌ టన్నుకు రూ.48వేలకు పెరిగింది. మార్కెట్లో వివిధ కంపెనీల సిమెంట్‌ బస్తా క్వాలిటీని బట్టి రూ.20 నుంచి రూ.70 వరకు పెరిగింది. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మోయినాబా ద్‌ తదితర మండలాల్లో  రెండు నెలల క్రితం ఇళ్ల నిర్మాణా లు చురుగ్గా జరిగినా ప్రస్తుతం పెరిగిన సిమెంట్‌ ధరల నే పథ్యంలో నిర్మాణాల వేగం మందగించింది. ఒక్కో సిమెంట్‌ బస్తా రూ.320 నుంచి 350 వరకు ఉంది. దీనికి తోడు ఇసుక, ఇటుక ధర లూ పెరుగుతున్నాయి. సామాన్యుడు ఇల్లు కట్టలేని విధంగా ధరలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ముడిసరుకుల ధరలతో పెరుగుదలతో వ్యాపారం కూడా సక్రమంగా నడవని పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోతున్నారు.

పెరుగుతున్న ఇసుక రేట్లు

ఇళ్ల నిర్మాణానికి ప్రధానంగా ఉపయోగపడే ఇసుక ధరలూ మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. టన్ను ఇసుక రూ.2800 నుంచి రూ.3200 వరకు ఉంటోంది. నాణ్యత బాగా ఉంటే ఈ ధర మరింత ఎక్కువే! దీంతో ఇళ్ల నిర్మాణాలు చేసే వారు ఇసుక ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాలు సంవృ ద్ధిగా కురువడంతో ఇసుక లారీలు వాగులోకి వెళ్లడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడింది. మరో రెండు నెలల్లో ఇసుక ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.


పెరిగిన ధరలతో ఇల్లు కట్టాలంటే భయమేస్తోంది


భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో కొత్తగా ఇంటి పనులు ప్రారంభించడం లేదు.  నిర్మాణ సామగ్రి ధరల పెరుగు దలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్లాటు ఉన్నా నిర్మి ంచుకోలేక కిరాయికి ఉంటున్నాం. ధరలు పెర గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గ్రా మాల్లో చాలా మంది ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. ధరల పెరుగుల దెబ్బకు చలా వరకు నిర్మాణా దశలో ఉన్న ఇళ్లు సైతం అగిపోతున్నాయి.

- యాదయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌, చేవెళ్ల


దరలు తగ్గేలా ప్రభుత్వం చూడాలి

సిమెంట్‌, ఐరన్‌ ధరలు పెరగడంతో ఇండ్ల నిర్మాణాలు చాలా వరకు  సగంలోనే నిల్చిపోయాయి. రోజుకో ధర ఉండడంతో నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. పెరిగిన ధరలతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్ర భుత్వం నిర్మాణ సామగ్రి ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.    

- మహ్మద్‌ ఖలీల్‌, చేవెళ్ల

Updated Date - 2020-11-25T04:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising