ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లలోనే ‘కొత్త’ సందడి.. న్యూ ఇయర్‌ వేడుకలకు అంతా సిద్ధం

ABN, First Publish Date - 2020-12-31T05:07:36+05:30

మరికొన్ని గంటల్లో పాత సం వత్సరానికి బైబై చెప్పి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : మరికొన్ని గంటల్లో పాత సం వత్సరానికి బైబై చెప్పి.. న్యూ ఇయర్‌లోకి వేడుకలు జరుపుకోవడానికి ఉమ్మడిజిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. కానీ కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్‌ వేడుకలను బయట చేసుకోవడానికి అనుమతి లేకపోవడంతో ఇళ్లలోనే చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సొంత వ్యవ సాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌ల్లో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించరాదని పోలీసులు యజమానులకు అవగాహన కల్పించారు. దీంతో వ్యవసాయ క్షేత్రాల నిర్వాహకులకు కూడా అనుమతులు ఇవ్వడం లేదు. రిసార్ట్స్‌లు 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకే తెరిచి ఉంచా లని... ఆ తర్వాత మూసేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. ఇప్పటికే మద్యం, నాటు కోళ్లను కొనుగోలు చేసి ఉంచారు.  కొందరు బేకరీల్లో న్యూ ఇయర్‌ కేక్‌లను ఆర్డర్‌ చేశారు. 


డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌లు..

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నగర శివారులోని శామీర్‌పేట్‌, కీసర, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా కొత్త సంవత్సర వేడుకలు జరిగే ఫాం హౌస్‌లు, రిసార్టులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 


ఈసారి ఇంట్లోనే వేడుకలు

గతేడాది న్యూ ఇయర్‌ వేడుకలను పొలం వద్ద చేసుకున్నాం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను ఎంజాయ్‌ చేశాం. ఈసారి పోలీసులు ఆంక్షలు విధించ డంతో ఇంట్లోనే ఘనంగా వేడుకలను జరుపుకుంటాం.

- జంగారెడ్డి, శంషాబాద్‌ 


బయటి వేడుకలకు దూరం

గతేడాది న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా నిర్వ హించుకున్నాం. ఈసారి వేడుకలను ప్రభుత్వం నిషేధించడంతో వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకుంటాం. 

- కావలి శ్రీనివాస్‌ ముదిరాజ్‌, హిమాయత్‌నగర్‌. 

Updated Date - 2020-12-31T05:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising