ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే అవమానించారని ఎంపీపీ నిరసన

ABN, First Publish Date - 2020-05-30T09:15:44+05:30

ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ తనను అవమానించారని ఎంపీపీ అనితావిజయ్‌ శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు/కడ్తాల : ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ తనను అవమానించారని ఎంపీపీ అనితావిజయ్‌ శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆమనగల్లు, కడ్తాల మండలాలకు చెందిన పలువురు దళిత, గిరిజన నాయకులతో కలిసి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ ఛాంబర్‌లో తన కుర్చీపై కూర్చొని తన మనోభావాలను దెబ్బతీసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, వైస్‌ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్‌, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గూడూరు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు 

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌పై ఎంపీపీ అనితావిజయ్‌ ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ నేనావత్‌ అనురాధ పత్యానాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, పొనుగోటి అర్జున్‌రావు, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి మాట్లాడుతూ ఎంపీపీ సీటుపై గతంలో మాదిరిగానే ఎమ్మెల్యే కూర్చున్నారే తప్ప అవమానపరిచే విధంగా వ్యవహరించలేదన్నారు. ఎమ్మెల్యేను రాజకీయంగా ఎదుర్కొలేక ఎంపీపీ అనితను అడ్డం పెట్టుకొని కొందరు స్వార్థ రాజకీయాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలు వీడి అభివృద్ధికి కలిసి రావాలన్నారు. 

Updated Date - 2020-05-30T09:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising