ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బు సంగతి నాకొదిలెయ్.. నువ్వు ఐఏఎస్ అవ్వాలంటూ ఎంపీ ఫోన్..

ABN, First Publish Date - 2020-11-13T21:06:36+05:30

భార్గవి.. నీవు బాగా చదివి ఐఏఎస్‌ సాధించాలి.. చదువుల సంగతి నువు చూస్కో.. ఆ చదువులకయ్యే ఖర్చుల విషయం నాకొదిలేయ్‌.. అని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి ఐకార్‌ జాతీయస్థాయి 14వ ర్యాంకు సాధించిన భార్గవికి భరోసా ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన రవీందర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్గవి.. ఐఏఎస్‌ సాధించాలి

చదువు సంగతి నీవు చూసుకో.. ఖర్చుల విషయం నాకొదిలేయ్‌!

ఐకార్‌లో జాతీయ ర్యాంకర్‌కు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి భరోసా


వికారాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : భార్గవి.. నీవు బాగా చదివి ఐఏఎస్‌ సాధించాలి.. చదువుల సంగతి నువు చూస్కో.. ఆ చదువులకయ్యే ఖర్చుల విషయం నాకొదిలేయ్‌.. అని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి ఐకార్‌ జాతీయస్థాయి 14వ ర్యాంకు సాధించిన భార్గవికి భరోసా ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన రవీందర్‌, సువర్ణ కూతురైన భార్గవి ఐసీఏఆర్‌ నిర్వహించిన జాతీయ ప్రవేశ పరీక్షలో 14వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఐకార్‌ ర్యాంకర్‌ భార్గవికి ఫోన్‌ చేసి అభినందించారు. లక్ష్యం ఏమిటి ? ఏమి కావాలని కోరుకుంటున్నావని రంజిత్‌రెడ్డి ఆమెను ప్రశ్నించారు. బాగా చదివి ఐకార్‌లో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి మన ప్రాంతానికి, జిల్లాకు మంచి పేరు తెచ్చావు.. ఇదే స్ఫూర్తితో చదువులు కొనసాగిస్తూనే సివిల్స్‌కు సన్నద్ధం కావాలని సూచించారు. ఐఏఎస్‌ సాధించి కలెక్టర్‌ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు ఎంత వరకు చదవాలనుకుంటే అంత వరకు చదవాలని, చదువు విషయంలో ఎలాం టి సాయం కావాలన్నా.. నేను తప్పకుండా చేస్తానని  భార్గవికి ఎంపీ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-13T21:06:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising