ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

ABN, First Publish Date - 2020-12-07T04:46:50+05:30

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌ : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన వి.కవితకు రూ.68వేలు, కల్వకుర్తి మండలం తుర్కలపల్లికి చెందిన విజయేందర్‌రెడ్డికి రూ.48వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా  మంజూరయ్యాయి. ఆదివారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబానికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనాతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. భౌతిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు ఎంపీపీ అనితవిజయ్‌, శ్రీకాంత్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. మాడ్గుల మండలం నాగిళ్లకు చెందిన కాశయ్యకు రూ.56 వేలు, కల్వకుర్తి మండలం గుండూరుకు చెందిన లక్ష్మీదేవమ్మకు రూ.25 వేలు, సందీ్‌పకు రూ.10వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. ఆమనగల్లులో ఆదివారం జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, టీఆర్‌ఎస్‌ మాడ్గుల మండల అధ్యక్షుడు లాలయ్యగౌడ్‌ లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అదే విధంగా ఇటీవల మృతి చెందిన మాడ్గుల మండలం నల్లవారిపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఇటికాల రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. 

Updated Date - 2020-12-07T04:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising