ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎ్‌సతోనే అన్ని వర్గాలకు మేలు

ABN, First Publish Date - 2020-11-30T05:19:32+05:30

టీఆర్‌ఎ్‌సతోనే అన్ని వర్గాలకు మేలు

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు : టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కల్వకుర్తి మండలం తాండ్ర గామానికి చెందిన ఎ.కిషన్‌కు రూ.44 వేలు, మాడ్గుల మండలం నాగిళ్ల కు చెందిన కె.మహదేవికి రూ.12 వేలు, వెల్దండ మండలం ఉబ్బలగుట్ట తండాకు చెందిన ఆర్‌.లచ్చుకు రూ.44వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. ఆదివారం నగరంలోని తన నివాసంలో బాధిత చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభు త్వం పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. టీఆర్‌ఎ్‌సతోనే నగర అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిని కాంక్షించే వారంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌్‌సను ఆదరించి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బల్దియా మేయర్‌ పీఠం మళ్లీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అనితవిజయ్‌, కమ్లీమోత్యనాయక్‌, రఘురాములు, జిల్లెల్ల రాములు, శ్రీనివా్‌సరెడ్డి, శంకర్‌నాయక్‌, రవీందర్‌రెడ్డి,  సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, విజయ్‌, బాబా, జావేద్‌, శంకర్‌నాయక్‌, శేషన్‌, క్రిష్ణ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising