ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

38వేల ఎకరాలకు నీరు.. జనవరి చివరి నాటికి పనులు పూర్తి

ABN, First Publish Date - 2020-12-30T04:41:43+05:30

38వేల ఎకరాలకు నీరు.. జనవరి చివరి నాటికి పనులు పూర్తి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జనవరి చివరి నాటికి కేఎల్‌ఐ డీ-82 కాల్వ పనులు పూర్తి
  • ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు : కేఎల్‌ఐ డీ-82 కాల్వ పనులు జనవరి చివరి నాటికి పూర్తి చేసి ఆమనగల్లు, మాడ్గుల, వెల్దండ మండలాల పరిధిలోని 38 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తెలిపారు. పనుల పూర్తికి, కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని సీఎంని కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లులో మంగళవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేఎల్‌ఐ డీ-82 కాల్వ పనుల పూర్తి, అటవీ శాఖ క్లియరెన్స్‌ గూర్చి ఆయా శాఖల అధికారులతో చర్చించి క్లియరెన్స్‌ తెచ్చినట్లు చెప్పారు. కేఎల్‌ఐ కాల్వ ద్వారా ఇప్పటికే 35 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలోని అన్ని గ్రామా లకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరందిస్తామని వివరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడి,్డ, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీంరెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, శ్రీనివా్‌సరెడ్డి , రూపం వెంకట్‌రెడ్డి పరామర్శించారు. 


ఘనంగా ఆంజనేయస్వామి ఇరుముడి పూజ

ఆమనగల్లులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఆంజనేయస్వాముల పడిపూజ, ఇరుముడి కార్యక్రమం, యజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురు స్వామి చుక్క నిరంజన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2020-12-30T04:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising