ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్‌ రాకకోసం కేటీఆర్‌ కృషి

ABN, First Publish Date - 2020-11-08T10:13:48+05:30

ప్రపంచ శ్రేణి బహుళజాతి సంస్థ అమెజాన్‌ తమ కొత్త ఆసియా పసిఫిక్‌ కేంద్రంగా రంగా రెడ్డి జిల్లాను ఎంపిక చేసిన నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను శనివారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి,  ఎంపీ  ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే  జడ్పీ చైర్‌పర్సన్‌ తదితరులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రపంచ శ్రేణి బహుళజాతి సంస్థ అమెజాన్‌ తమ కొత్త ఆసియా పసిఫిక్‌ కేంద్రంగా రంగా రెడ్డి జిల్లాను ఎంపిక చేసిన నేపథ్యంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసీరివర్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌సభ్యుడు రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు కార్తీక్‌రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాతి గాంచిన ఐటీసంస్థ అమెజాన్‌ అమెరికా నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చేందుకు మంత్రి కేటీఆర్‌ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. కేటీఆర్‌ ఫలితంగానే అమెజాన్‌ సంస్థ దేశంలో అతిపెద్ద పుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతోందన్నారు. 


జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఆసియా, పసిఫిక్‌ ప్రాంతీయకేంద్రం ద్వారా వేలాది మంది స్థానికు లకు ప్రత్యేకంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అంకుర పరిశ్రమ లను స్థాపించాలనుకునే స్థానిక యువతకు లాభం చేకూరుతుందని తెలిపారు. అమెజాన్‌లాంటి ప్రఖ్యాతసంస్థ ఇంతభారీ ఎత్తున రంగారెడ్డి జిల్లాలో డాటాసెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెడు తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో డాటా సెంటర్ల ఏర్పాటుకు జిల్లా ఆకర్షణీయమై కేంద్రంగా మారే అవకాశ ముందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు పరంపర ఇదేధంగా కొనసాగితే త్వరలో జిల్లా రూపురేఖలే మారిపోతాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-11-08T10:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising