టీఆర్‌ఎస్ హయాంలోనే పట్టణాల అభివృద్ధి : మంత్రి
ABN, First Publish Date - 2020-12-30T03:46:36+05:30
టీఆర్‌ఎస్ హయాంలోనే పట్టణాల అభివృద్ధి : మంత్రి
మేడ్చల్ : టీఆర్‌ఎ స్ ప్రభుత్వ హయాంలో నే రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గణనీయంగా అభివృద్ధి జరుగుతుంద ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని వైకుంఠధామం నుంచి ఎన్‌హెచ్- 44 వరకు నూతనంగా ఏర్పాటు చే సిన సింగిల్ ఆర్మ్ లైట్లను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు వీణాసురేందర్‌గౌడ్, పెంటయ్యముదిరాజ్, మల్లికార్జున్, జైపాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు మద్దుల శ్రీనివా్‌సరెడ్డి, కందాడి నరేందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌ముదిరాజ్, డిప్యూటీ ఈఈ చిరంజీవులు, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T03:46:36+05:30 IST