ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2020-12-05T05:42:02+05:30

ఇళ్లు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తాం

రైల్వే వంతెన పనులను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైల్వే వంతెన పనులు నిలిచిపోకుండా చర్యలు 
  • రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి


ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ రైల్వే వంతెన పనుల్లో భాగంగా జాతీయ రహదారి వైపు ఇళ్లు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌లోని బాలాజీనగర్‌లో గత కొంతకాలంగా నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన పనులను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇళ్లు కోల్పోతున్న బాధితులతో సమావేశం నిర్వహించి అందరినీ ఒప్పిస్తామన్నారు. నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే రహదారి కావడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోతున్న బాధితులకు రావాల్సిన నష్టపరిహారం సొమ్మును న్యాయస్థానంలో డిపాజిట్‌ చేసినట్లు గుర్తు చేశారు. బాధితుల డిమాండ్‌ మేరకు  60 చదరపు గజాల స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లేష్‌, ఆంజనేయులు, వెంకట్‌రెడ్డి, రవీందర్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్‌కే సౌకత్‌మియా, సురేందర్‌రెడ్డి. నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, వై.సుధాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, అంజిరెడ్డి, సంజీవరెడ్డి, మురళి, శ్రీనివా్‌సగౌడ్‌, సిరాజ్‌, హరిశంకర్‌, చిన్న శ్రీనివా్‌సగౌడ్‌, నర్సింగ్‌ రావు, పద్మారెడ్డి, విజయ్‌ పాల్గొన్నారు.


వివాహ వేడుకకు హాజరైన మంత్రి


మేడ్చల్‌: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడి సోదరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మేడ్చల్‌ మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ జనరల్‌ సెక్రటరీ చందు సోదరి వివాహం శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డితో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డి, జిల్లా గ్రం థాలయ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, మోనార్క్‌, కౌన్సిలర్లు,  కార్య కర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising