ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ స్టేడియాల ఏర్పాటుకు కార్యాచరణ

ABN, First Publish Date - 2020-12-28T05:24:28+05:30

మినీ స్టేడియాల ఏర్పాటుకు కార్యాచరణ

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ 

కడ్తాల్‌ : ప్రతి మండల కేంద్రంలో మినీ స్టేడియాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అన్నారు. విద్య, క్రీడల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల్‌ మండలం రావిచెడ్‌ గ్రామంలో క్రీడల నిర్వహణకు అనువైన స్థలం కేటాయించాలని ఆదివారం స్థానిక యువకులు, ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌తో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కోరారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే  గ్రామంలో అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యావంతులు, క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. సామాజిక సేవ, ప్రజాచైతన్య కార్యక్రమాలలో యువత ముందుండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రావిచెడ్‌ మాజీ సర్పంచ్‌ విఠలయ్యగౌడ్‌, న్యామతాపూర్‌ సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, నిట్ట నారాయణ, తోట గిరియాదవ్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising