ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో రుణాలు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T05:07:37+05:30

సకాలంలో రుణాలు మంజూరు చేయాలి

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పౌసుమి బసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : రైతులకు సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆమె రైతులకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులకు సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. వీధి వర్తకులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. అర్హులైన ఎస్టీ, ఎస్సీ లబ్ధ్దిదారులకు ఉపాధి రుణాలు మంజూరు చేయాలన్నారు.  కిసాన్‌మిత్ర కాల్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ హర్షిత్‌ తమ దృష్టికి వచ్చిన రైతు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ఎల్‌డీఎం రాంబాబు, డీఆర్‌డీఏ కృష్ణన్‌, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మోజెస్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు, పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising