ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌరారం సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు

ABN, First Publish Date - 2020-04-05T09:46:10+05:30

స్థానికంగా నివాసం ఉండని బొంరాస్‌పేట్‌ మండలం, గౌరారంగ్రామ సర్పంచ్‌పై చట్టపరమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పౌసుమి బసు


వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి): స్థానికంగా నివాసం ఉండని బొంరాస్‌పేట్‌ మండలం, గౌరారంగ్రామ సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పౌసుమి బసు స్పష్టం చేశారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో ఆమె పలువురి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు ఆమె స్పందించి తగు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ఈ సమయంలో గౌరారం సర్పంచ్‌ హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ గ్రామానికి చెందిన ఒకరు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.


దీంతో ఆ సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. రేషన్‌ బియ్యం పంపిణీ, కొత్త రేషన్‌ కార్డుల జారీ, పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు ఆమె స్పందించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ మాట్లాడుతూ, కరోనా, రేషన్‌ బియ్యం తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800 599 2644కు కాల్‌ చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, కంట్రోల్‌రూం ఇన్‌చార్జి కోటాజీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T09:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising