రోడ్డు పక్కన చెత్త వేస్తే రూ.ఐదువేలు జరిమానా
ABN, First Publish Date - 2020-12-05T05:21:09+05:30
రోడ్డు పక్కన చెత్త వేస్తే రూ.ఐదువేలు జరిమానా
మోమిన్‌పేట : రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మేకలు, కోళ్ల వ్యర్థాలు వేస్తే చికెన్, మటన్ వ్యాపారులకు రూ.5వేలు జరిమానా, కేసులు నమోదు చేస్తామని సర్పంచ్ అంగేరి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో కార్యదర్శి నర్సింహులు, షాపు యజమానులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచిఎవరైనా వ్యర్థ పదార్థాలు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామంలో పారిశుధ్య పనుల కోసం ప్రభుత్వం ట్రాక్టరును ఇవ్వడం జరిగిందని, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మీ వద్దకు వచ్చినపుడు వ్యర్థాలను అందులో వేయాలని అన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, దుకాణ యజమానులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T05:21:09+05:30 IST